కనిగిరి: పట్టణంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కనిగిరి వ్యవసాయ శాఖ అధికారి జైనులాబ్దిన్
కనిగిరి పట్టణంలోని పలు విత్తనాలు, ఎరువుల దుకాణాలను కనిగిరి మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ జైనులాబ్దిన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లో రికార్డులను, స్టాకును తనిఖీ చేశారు. విక్రయిస్తున్న ఎరువులు, విత్తనాలు నకిలీవో, కాదో తెలుసుకునేందుకు వాటి నమూనాలను ల్యాబ్ కు పంపించారు. ఈ సందర్భంగా జైనులాబ్దిన్ మాట్లాడుతూ ... రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా తగు రసీదులను పొందాలన్నారు. రసీదులు ఇవ్వకుండా షాపుల నిర్వాహకులు నిరాకరిస్తే తన దృష్టికి తేవాలన్నారు. నకిలీ ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.