కనిగిరి: వెనుకబడిన కనిగిరి నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయం: విశాఖలో కనిగిరి నియోజకవర్గ వాసులతో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: విశాఖపట్నంలో స్థిరపడిన కనిగిరి నియోజకవర్గ ప్రజలతో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వెనుకబడిన కనిగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చొరవతో నియోజకవర్గానికి నిధులు సాధించి, అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విశాఖలో స్థిరపడిన కనిగిరి నియోజకవర్గ వాసులు కనిగిరిలో చిన్న తరహా పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు.