కనిగిరి: కనిగిరి నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం, పాల్గొన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు
కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పామూరు, కనిగిరి, హనుమంతుని పాడు, వెలిగండ్ల, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు, సచివాలయాల పరిధిలో యోగా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కనిగిరిలో నిర్వహించిన యోగా దినోత్సవం కార్యక్రమంలో అధికారులతో యోగా శిక్షకులు యోగ సాధన చేయించారు. కనిగిరి తహసిల్దార్ రవిశంకర్ మాట్లాడుతూ... యోగాతో మానసిక, శారీరక రుగ్మతలు దూరమవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేసే సత్తా యోగాకు ఉందన్నారు.