శ్రీశైలం: మహానంది ఆలయంలో అరుదైన రక్తపింజరి పాము ప్రత్యక్ష్యం
మహానంది ఆలయంలో అరుదైన రక్తపింజరి పాము ప్రత్యక్షమై కలకలం రేపింది. ఆలయంలోని వినాయక నంది సమీపంలో పామును గుర్తించిన ఆలయ సిబ్బంది వెంటనే స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మోహన్ ఆలయానికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకున్నారు. దీంతో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. పామును సురక్షితంగా పట్టుకోవడంతో భక్తులు, ఆలయ సిబ్బంది మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పరిసరాల్లో పాములు సంచరించే అవకాశం ఉన్నందున భక్తులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.