సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట వేణుగోపాల స్వామి రథోత్సవం: భక్తులకు సీఐ వెంకటేష్ సూచనలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరగనున్న వేణుగోపాల స్వామి రథోత్సవం సందర్భంగా, జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ వెంకటేష్ కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.