తిప్పర్తి: ఆరు పడకలు కలిగిన తిప్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 20 పడకల ఆసుపత్రిగా మార్చాలి: ఐద్వా మండల ప్రధాన కార్యదర్శి ఉమా
రాష్ట్ర ఐద్వా మహిళా సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం మధ్యాహ్నం ఐద్వా తిప్పర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం తిప్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి జంజరాల ఉమా మాట్లాడుతూ.. ఆరు పడకలు కలిగిన తిప్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇరవై పడకల ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవనం శిథిలావస్థకు చేరిందని మండలంలోని పలు గ్రామాల నుండి రోజుకు 100 నుండి 150 వరకు రోగులు వస్తుంటారని, వారు భవనం ఎప్పుడు కూలుతుందో అని బికుబుక్కుమంటూ ఆసుపత్రికి వస్తుంటారని తెలిపారు.