తిప్పర్తి: గ్రూపు వన్ పరీక్ష రద్దు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్
నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలోని నర్రా రాఘవరెడ్డి భవన్ లో ఆదివారం సాయంత్రం డివైఎఫ్ఐ 8వ మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ.. గ్రూపు-1 పరీక్షలలో అవకతవకలు తిరగడం ద్వారా పరీక్ష రద్దు కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. నిరుద్యోగులు లక్షల రూపాయలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని పరీక్షలు రాస్తున్నారని, కానీ కొందరు అధికారులకు డబ్బులు ఆశ చూపి తప్పుడు మార్గంలో ర్యాంకులు పొందే ప్రయత్నం చేయడంతో నిజమైన అభ్యర్థులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డివైఎఫ్ఐ నిరుద్యోగుల పక్షాన పోరాడుతుందని తెలిపారు.