సిరిసిల్ల: బాల్య వివాహ రహిత గ్రామంగా నేరెళ్ల: ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన అధికారులు
రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్, బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు చందన ఈ కార్యక్రమంలో పాల్గొని, జిల్లాను బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.