పలమనేరు: డైలీ మార్కెట్ వద్ద 15ఏళ్ల నుంచి రోడ్డుపైనే వ్యాపారం చేస్తున్నాము మమ్మల్ని పంపకండి అంటూ ఆవేదన వ్యక్తం#Localissue
పలమనేరు: పట్టణం డైలీ మార్కెట్ వద్ద బుధవారం కూరగాయల వ్యాపారులు ఆందోళన చేపట్టారు. తాము గత 15 సంవత్సరాలుగా మార్కెట్ కు ఆనుకొని వీధులలో వ్యాపారం చేసుకుంటున్నామన్నారు మున్సిపల్ అధికారులు సంత లోపల వ్యాపారాలు చేసుకోమని చెబుతున్నారు కానీ అక్కడ వ్యాపారాలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రాలో డబ్బులు కట్టాలి డైలీ గేట్ కట్టాలి అప్పులు కట్టాలి ఇలా మమ్మల్ని గత రెండు నెలల నుండి ఇబ్బంది పెడుతున్నారు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని డైలీ వ్యాపారస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కాయగూరలు ఆకుకూర కట్టలు విసిరి కొట్టారు.