యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వేసవి సెలవులు ముగియడంతో ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకీటలాడాయి .స్వామివారి నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు .భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.