విశాఖపట్నం: పెందుర్తిలో 50 లక్షలతో అభివృద్ధి పనులు: పల్లె పండుగ 3.0 లో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల
పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలో 50 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ 3.0లో భాగంగా పెందుర్తి, పరవాడ మరియు సబ్బవరం మండలాలకు భారీగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.