వికారాబాద్: ఇంటర్ పరీక్ష సందర్భంగా జిల్లాలో పటిష్టమైన బందోబస్తు - ఎస్పీ కోటిరెడ్డి.
ఇంటర్ పరీక్షల సందర్భంగా వికారాబాద్ జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.