కూసుమంచి: ఖమ్మం: నవంబర్ 5న ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్
ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 5న మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఏ-1 ఫలితాలు, విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు మరియు ప్రత్యేక బోధనపై చర్చించనున్నారు. తల్లిదండ్రులు హాజరు కావాలని సూచించారు.