నిజామాబాద్ సౌత్: తెలంగాణ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన: ఖాళీ కుర్చీలకే వినతి పత్రం
తెలంగాణ యూనివర్సిటీలో జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని 275 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఖాళీ కుర్చీలకే వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ జీతాలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.