కనిగిరి: కనిగిరి సీఐ కార్యాలయంలో రౌడీ శీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్
ప్రకాశం జిల్లా కనిగిరి సీఐ కార్యాలయం ఆవరణలో ఆదివారం డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్ లో సీఐ ఖాజావలి, కనిగిరి ఎస్సై శ్రీరామ్, హనుమంతుని పాడు ఎస్సై మాధవరావు పాల్గొన్నారు. రౌడీ షీటర్లు సామాన్య ప్రజలతో సఖ్యతగా మెలుగుతూ నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని సూచించారు. రౌడీ షీటర్ల పై నిరంతరం నిఘా ఉంటుందని అసాంఘిక కార్యకారపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలిగిరి డిఎస్పి తీవ్రంగా హెచ్చరించారు.