పాయకరావుపేట: ఎస్.రాయవరం: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మహిళల మృతి
ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అత్తాకోడళ్లు (నూకతల్లి, రత్నం) మృతి చెందారు. అనకాపల్లికి చికిత్స కోసం వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒరుపుల నారాయణ అనే వ్యక్తి గాయపడ్డారు.