హత్నూర: నర్సాపూర్ రాయరావ్ చెరువు వద్ద జరిగిన మర్డర్ కేసును చేదించిన పోలీసులు, కేసు వివరాలను వెల్లడించిన తూప్రాన్ డిఎస్పీ
నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ లోని రాయరావ్ చెరువు వద్ద సోమవారం రాత్రి జరిగిన మర్డర్ కేసును చేదించి నిందితులను అరెస్టు చేసి బుధవారం నర్సాపూర్ పీఎస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ కి చెందిన ఫరూక్ అన్సారి ని వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు డిఎస్పి పేర్కొన్నారు. కేసును చేదించిన పోలీసులను అభినందించారు.