హసన్పర్తి: సీతంపేటలో 200 ఏళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ వేడుకలు
హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేటలో నేతకాని సామాజికవర్గం ఆధ్వర్యంలో 200 ఏళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో జోడెడ్ల ప్రతిమల పూజ, ఊరేగింపు మరియు మహిళల బతుకమ్మ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.