నాగర్ కర్నూల్: 10న హైదరాబాద్లో ఉద్యోగుల ధర్నా: విజయవంతం చేయాలని పిలుపు
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం 10వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో TGE JAC ధర్నా నిర్వహిస్తోంది. పెండింగ్ పీఆర్సీ, డీఏలు, సీపీఎస్ రద్దు డిమాండ్లతో జరుగుతున్న ఈ ధర్నాలో పాల్గొనాలని PRTU జిల్లా అధ్యక్షుడు ఆర్. రాముడు నాయక్ పిలుపునిచ్చారు.