ఆత్మకూరు: జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన డాక్టర్ ఖాదర్ వలీ
సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్ అశోక్ కుమార్ ఆశా కార్యకర్తల సమావేశం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి అడిషనల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఖాదర్ వలీ పాల్గొని ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలతో సమీక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.ప్రతి ఆశా కార్యకర్త తమ పరిధిలోని ప్రతి ఇంటినీ సందర్శించి, ఎవరికైనా జ్వరం లేదా ఇతర వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.ప్రజలు ఇళ్ల చుట్టూ, గ్రామాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.ప్రజలు