శ్రీశైలం: బండిఆత్మకూరు మండలం యర్రగుంట్లలో FBT యాప్ పేరుతో ఘరానా మోసం
బండిఆత్మకూరు మండలం యర్రగుంట్లలో FBT యాప్ పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని అమాయక రైతు కూలీలను టార్గెట్గా చేసుకుని రూ.18,500 కడితే ప్రతిరోజూ రూ.630 ఇస్తామని నమ్మబలికి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. వ్యవసాయ పనులు లేకపోవడంతో సులభంగా ఆదాయం వస్తుందన్న ఆశతో పలువురు రైతు కూలీలు పెద్ద మొత్తంలో డబ్బులు కట్టారు. అయితే ఆ తర్వాత డబ్బులు రాకపోవడంతో తాము మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మురళీమోహన్ ఫిర్యాదు మేరకు FBT యాప్ను పరిచయం చేసిన మహేష్, రామాంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.