జులై ఆరవ తేదీన జునోసిస్ డే సందర్భంగా కాకినాడ జిల్లా సామర్లకోట ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రి నందు ఆదివారం ఉదయం 9 గంటల నుండి కుక్కలకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు.సామర్లకోట వెటర్నరీ ఆసుపత్రిలో భీమేశ్వర లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లైన్స్ అధ్యక్షులు శ్రీనివాసరావు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏడి డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ కుక్కల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, రేబిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరమని వివరించారు. యొక్క కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు, కూటమి నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.