ఉరవకొండ: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యునిగా తగ్గుపర్తి చందు ఎన్నిక
విశాఖపట్నంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశాలలో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన విద్యార్థి సంఘం నాయకులు బెళుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామానికి చెందిన చందు ని రాష్ట్ర సమితి సభ్యునిగా ఎన్నుకోవడం జరిగిందిని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ నాసర్ జీ బుధవారం పేర్కొన్నారు. అనంతపురం జిల్లా నుండి తనకు నాపై నమ్మకం ఉంచి నా ఎన్నికకు సహకరించిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వానికి, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయి స్వామి గారికి మరియు జిల్లా నాయకత్వానికి చందు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.