రాజమండ్రి సిటీ: తూర్పుగోదావరి జిల్లాలో స్కానింగ్ సెంటర్లపై అధికారుల ఆకస్మిక తనిఖీలు
తూర్పుగోదావరి జిల్లాలో పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం కింద ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మిషన్లు సీజ్ చేసి, రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.