పుత్తూరు: పుత్తూరు మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన డి. ఎలుమలై
పుత్తూరు మున్సిపల్ చైర్మన్‌గా జనసేన అభ్యర్థి డి. ఎలుమలై (అమ్ములు) మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మోహన్, ఎమ్మెల్యే భాను ప్రకాష్ పాల్గొన్నారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన ఎలుమలై, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 10,023 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.