పెద్దాపురం: సామర్లకోట భీమేశ్వరాలయంలో ఘనంగా తొలి అభిషేకం, పోటెత్తిన భక్తులు
సామర్లకోట పంచారామ క్షేత్రం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఏకాదశ మహా రుద్రాభిషేకం మరియు కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు భక్తులకు పులిహార ప్రసాదాన్ని పంపిణీ చేశారు.