జడ్చర్ల: జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని కావేరమ్మపేటలో16 మందిని కరిచిన పిచ్చికుక్క
జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని కావేరమ్మపేటలోని కమ్యూనిటీ భవనం దగ్గర శనివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. 16 మందిపై విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ కుక్క దాడిలో గాయపడిన ఇద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని 108 అంబులెన్స్ లో మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది