జడ్చర్ల: జడ్చర్ల కావేరమ్మపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన గొర్రెల, మేకల సంత ప్రారంభం హాజరైన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
కాపరులు, రైతులకు ఉపయోగపడే సంత – ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జడ్చర్ల మున్సిపాలిటీలోని కావేరమ్మపేటలో ఏర్పాటు చేసిన కొత్త గొర్రెల, మేకల సంతను నేడు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ, రైతులు, కాపరులు, స్థానిక వ్యాపారులకు ఉపయోగపడే విధంగా సంతను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. పశువుల పెంపకం గ్రామీణ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకలాంటిదని, ఈ సంత ద్వారా వ్యాపార లావాదేవీలు సులభతరమవుతాయని, కాపరులకు తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు.