చదరాఘాట్ పరిధిలో గంజాయి మత్తులో సెల్ఫోన్ దుకాణ యజమానిని కత్తులతో బెదిరించి, మామూళ్లు డిమాండ్ చేసిన రౌడీషీటర్ సల్మాన్ బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సీఐ కే.బి.మురారి స్పందించి నిందితుడితో బహిరంగంగా క్షమాపణ చెప్పించారు. ఇకపై గొడవలు చేయనని సల్మాన్ హామీ ఇచ్చాడు. పోలీసుల తక్షణ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.