పలాస: పలాసలో ముమ్మరంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం: ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఎన్నికల ప్రచారం చేపట్టారు. 25, 36 వార్డుల్లో కూటమి అభ్యర్థుల గెలుపును కోరుతూ ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సేవలను గుర్తించాలని, పట్టణ అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.