నిజామాబాద్ నార్త్: కనీస వేతనాల జీవో 6 అమలు చేయాలని కలెక్టరేట్ వద్ద ధర్నా
కనీస వేతనాల జీవో 6 అమలు చేయాలని, స్పెషల్ స్క్వాడ్ నియమించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద TUCI ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జీవో ప్రకారం వేతనాలు అందడం లేదని, తక్కువ వేతనాలతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు డీఆర్ఓకు వినతిపత్రం ఇచ్చారు.