కుత్బుల్లాపూర్: గాగిలాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం: కారు డ్రైవర్ మృతి
జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాగిలాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ మృతి చెందారు. రాంగ్ రూట్లో వచ్చిన బొలెరో వాహనం కారును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.