మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం: డిసెంబర్ నెలాఖరులోగా భూముల రీసర్వే పూర్తి చేయాలి - కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల గ్రామాల్లో భూముల రీసర్వేను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రీసర్వే ప్రక్రియను పరిశీలించిన ఆయన, రైతు సమస్యల పరిష్కారానికి మరియు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులకు సూచనలు జారీ చేశారు.