నంద్యాల అర్బన్: కలెక్టరేట్ వద్ద మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Sep 13, 2026
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కోరింది. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ భవనంలో ఉచితంగా 3వేల మట్టి గణేశ విగ్రహాలను కలెక్టర్ రాజకుమారి పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినియోగించకుండా, పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు.