మోత్కూర్: మోత్కూరులో ఘనంగా కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలు
మోత్కూరులో కాళోజీ నారాయణరావు 112వ జయంతిని బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాంతాచారి చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, తెలంగాణ భాషా, సంస్కృతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.