గుంతకల్లు: పూలగుంట సమీపంలో భార్యను అతిదారుణంగా చంపిన కసాయి భర్తను అరెస్టు చేసిన పోలీసులు
గుత్తి మండలం పూలకుంట సమీపంలోని మంగళవారం కంకర్ మిషన్ వద్ద శివలింగయ్య తన భార్య లక్ష్మీని వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో రాళ్లతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. మైనాపురం గ్రామానికి చెందిన శివలింగయ్య తన భార్య లక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో చంపడం జరిగింది. మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఘటనపై సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ విచారణ చేపట్టారు. గుత్తి శివారులోని లచ్చానపల్లి రోడ్డులో బుధవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న హంతకుడు శివలింగయ్యను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ రామారావు విలేకరులకు వెల్లడించారు.