దర్శి: దర్శి నియోజకవర్గంలోని నూజెండ్లపల్లి, ఈస్ట్ కంభంపాడు గ్రామ పంచాయతీలను తనిఖీ చేసిన డివిజనల్ పంచాయతీ అధికారి పద్మ
దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలంలోని నూజెండ్లపల్లి, ఈస్ట్ కంభంపాడు గ్రామ పంచాయతీలను డివిజనల్ పంచాయతీ అధికారి పద్మ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. గ్రామాల్లో చెత్త కుప్పలు ఉండరాదని, రోడ్ల పక్కన దిబ్బలు తొలగించాలని ఆదేశించారు.