యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలోని వ్రత మండపంలో తనిఖీలు నిర్వహించిన ఆలయ ఈఓ వెంకట్రావు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండకింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో గురువారం ఆలయ ఈవో వెంకట్రావు తనిఖీలు నిర్వహించారు. భక్తులకు ఇస్తున్న సామాగ్రి, రిజిస్టర్ను పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.