హత్నూర: మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు : హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి
మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీ చర్యలు తీసుకుంటామని హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ కాసాల చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వాహనాల తలికిని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా జైలుకు వెళ్తారని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనదారులు సీటు బెల్టు హెల్మెట్ ధరించాలని సూచించారు.