మానకొండూరు: రాత్రిపూట కాంగ్రెస్ నాయకుల ఇండ్లకు యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే రసమయి..
రాత్రిపూట కాంగ్రెస్ నేతల ఇండ్లకు యూరియా బస్తాలు: రసమయి యూరియా బస్తాల కోసం రైతులు హరిగోశ పడుతున్నారు.దీనిపై మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందస్తు అవగాహన లేకపోవడం వల్లే రైతులకు యూరియా కష్టాలు వచ్చాయని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. యూరియా కోసం తెల్లవారు జామువరకు లైన్లో నిలబడ్డ రైతులకు ఒక్క బస్తా ఇస్తుంటే, కాంగ్రెస్ నాయకులు ఒక్కరూ లైన్లో నిలబడకున్నా యూరియా రాత్రిపూట వారి ఇండ్లకు వచ్చి చేరుతున్నాయని, దీనిపైన ఎమ్మెల్యే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.