కళ్యాణదుర్గం: కృష్ణాపురంలో పెన్షన్లను పంపిణీ చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు
కుందుర్పి మండలం కృష్ణాపురంలో బుధవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. మొదట ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందజేశారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల పక్షపాతి అన్నారు. పేదల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు.