వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో మైనార్టీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినీ చితక బాదిన ప్రిన్సిపాల్, తల్లిదండ్రుల ఆందోళన
వికారాబాద్ జిల్లా కేంద్రంలో మైనార్టీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్ చితకబాదిన ఘటన సోమవారం జరిగింది. దీంతో సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేయడం జరిగింది. దీనిపై జిల్లా విద్య అధికారికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనా అల్లరి చేస్తే తల్లిదండ్రుల దృష్టికి తీసుకొస్తే పనిష్మెంట్ ఇస్తామని ఇలా చితకబాధడం ఏమిటని వారు ఆందోళన నిర్వహించారు.