ఒంగోలు అర్బన్: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో 55 మంది వైసీపీని వీడి టిడిపిలో చేరిక, పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ
Ongole Urban, Prakasam | Sep 12, 2026
ప్రకాశం: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీకి షాక్ తగిలింది. 55 మంది వైసీపీకి చెందిన యువకులు ఆ పార్టీని వీడి టిడిపిలో చేరారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో యువకులు పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కలిసికట్టుగా పనిచేయాలని వారికి సూచించారు. కంభం, కందులాపురం ప్రాంతాలకు చెందిన 55 మంది వైసిపిని విడి టిడిపిలో చేరారని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆ పార్టీ కార్యకర్తలు టిడిపి వైపు వస్తున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు.