వికారాబాద్: సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 173 ఫిర్యాదులు: కలెక్టర్ నారాయణరెడ్డి
సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 173 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. వీటిలో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు, ఆసరా పింఛన్, పంచాయతీరాజ్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్, మెడికల్ డిపార్ట్మెంట్, డిస్టిక్ అగ్రికల్చర్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసుకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేశామని వెల్లడించారు.