వికారాబాద్: పులుసు మామిడి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో వినయ్ కుమార్
పులుసుమామిడి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను వికారాబాద్ ఎంపీడీవో వినయ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి యాదయ్య తదితరులు పరిశీలించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.