వికారాబాద్: జిల్లా కలెక్టరేట్‌లో ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్, లీడ్ బ్యాంకు మేనేజర్లు
ఈ నెల 26 నుండి 29వ తేదీ వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబాబు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.