కొండపి: తనకు ప్రాణహాని ఉందంటూ ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ ని ఆశ్రయించిన పొన్నలూరు కు చెందిన సుజాత
ప్రకాశం జిల్లా పొన్నలూరుకు చెందిన కమ్మరపల్లి సుజాత ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజాను మంగళవారం కలిసి తనకు ప్రాణహాని ఉందని జనసేన నాయకులతో వెళ్లి ఫిర్యాదు చేశారు. తన ఇంటి పక్కన ఉండే బాలకోటయ్య తనను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడని, తన ఇంటి ఆవరణలో మూత్రం సైతం పోస్తున్నాడని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. తన భర్త 8 నెలలుగా బయట ఉంటున్నాడని, ఇది అదునుగా అతను ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పారు.