సికింద్రాబాద్ లోని రైల్వే నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మ్యానేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవతో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే సమస్యలు, ROB, RUBల నిర్మాణాలు, నూతన రైల్వే ట్రాక్ లైన్లు, పలు రైళ్ళ హల్టింగ్, నూతన స్టేషన్ల ఏర్పాటు వంటి వివిధ అంశాలపై సుదీర్ఘంగా రైల్వే జీ.యంతో ఎంపీ ఈటల రాజేందర్ చర్చించారు.