మానకొండూరు: బ్రెయిన్ డెడ్ తో మృతి చెందిన వ్యక్తి అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులు...
బ్రెయిన్ డెడ్ తో మృతి చెందిన వ్యక్తి అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులు..కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన చిలువేరు రాజేశ్ గత వారం రోజుల క్రితం కరీంనగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.గాయాలపాలైన రాజేశ్ను చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లగా అక్కడ రాజేశ్ బ్రెయిన్ డెడ్తో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కాగా, గుండెనిండా విషాదంలోనూ బాధిత కుటుంబీకులు అతడి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు.