శ్రీశైలం: మహానంది మండలంలో రెచ్చి పోతున్న మట్టి మాఫియా, సోషల్ మీడియాలో వార్తలు వైరల్, విచారణ చేపట్టిన అధికారులు
మహానంది మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైవే పనుల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మైనింగ్ అధికారులు స్పందించారు. మహానంది మండలం బసవాపురం గ్రామ సమీపంలోని భూముల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను మైనింగ్ అధికారులు పరిశీలించారు. తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను సేకరించారు. నిబంధనలకు అనుగుణంగానే తవ్వకాలు జరుగుతున్నాయా లేదా అనే అంశంపై అధికారులు పరిశీలన చేపట్టారు.